ELR: విద్యాసంస్థల బస్సుల్లో ఉన్న భద్రతా లోపాలను తక్షణం సవరించకపోతే కఠిన చర్యలు తప్పవని ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) షేక్ కరీమ్ హెచ్చరించారు. ఏలూరులో విద్యాసంస్థల బస్సు డ్రైవర్ల ప్రతినిధులతో కరీమ్ డీటీసీ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అన్ని బస్సుల్లో ఉన్న భద్రతా లోపాలను ఈనెల 10లోగా సవరించుకోవాలన్నారు. లేకుంటే బస్సులను సీజ్ చేస్తామన్నారు.