ADB: గాదిగూడ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం మండలాధ్యక్షుడిగా కోట్నక్ సక్కు, ఉపాధ్యక్షులుగా సురేష్, మారుతీ, బాపూరావు ఎన్నికయ్యారు. దీంతో ఆదివాసీలు, సభ్యులు వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివాసీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని వారు హమిచ్చారు.