విమానాశ్రయాల్లో ATC వ్యవస్థలో సమస్యపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. సాంకేతిక లోపం వల్లే అంతరాయం ఏర్పడింది తప్ప, దీని వెనుక బయట వ్యక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అయినా ఈ సమస్యపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తామని, విమానాలు సకాలంలో నడిచేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.