టమోటాలలో సహజంగా ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది. కిడ్నీలో అత్యంత సాధారణంగా ఏర్పడేవి కాల్షియం ఆక్సలేట్ రాళ్లు. ఈ కారణంగానే టమోటాలు తింటే రాళ్లు పెరుగుతాయనే అపోహ మొదలైంది. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సాధారణ మోతాదులో టమోటాలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. 100 గ్రాముల టమోటాలో కేవలం 5 గ్రాముల ఆక్సలేట్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.