TG: మాజీ సీఎం KCR కుటుంబంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. KCR కంటే KTR పెద్ద మూర్ఖుడు అని ఆయన ఘాటు వ్యాఖ్య చేశారు. KTRకు KCR సీఎం కావాలని లేదని ఆయన ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి రోషం ఉంటే KTRను తక్షణమే జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ ఇప్పటివరకు ఒక్క కేసులోనూ KCR కుటుంబాన్ని జైల్లో పెట్టలేదని ఆయన మండిపడ్డారు.