NZB: అత్యంత పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి మలావత్ దేవీదాస్ (50) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు.