ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ యూనిటీ (వామపక్షాల కూటమి) ఘన విజయం సాధించింది. అన్ని ప్రధాన స్థానాల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP)పై లెఫ్ట్ యూనిటీ అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యంగా JNU ప్రెసిడెంట్గా లెఫ్ట్ యూనిటీ అభ్యర్థి అదితీ మిశ్రా ఎన్నికయ్యారు.