ASF: కాగజ్ నగర్లో మూతపడ్డ సర్ సిల్క్ మిల్లు స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి నూతన పరిశ్రమ స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని CPM నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ మిల్లు స్థలాన్ని వేలం వేస్తే ప్రైవేట్ వ్యక్తులకు చెందకుండా ప్రభుత్వమే అఫీషియల్ లిక్విడేటర్ నుంచి కొనుగోలు చేయాలన్నారు.