అనకాపల్లి: నక్కపల్లి ఎంపీడీవో గా బి. చైతన్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సబ్బవరం డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేస్తున్న చైతన్య పదోన్నతపై నక్కపల్లి వచ్చారు. ఇప్పటివరకు ఇంఛార్జ్ ఎంపీడీవోగా పనిచేస్తున్న సీతారామరాజు ఆమెకు బాధ్యతలు అప్పగించారు. అధికారులు సిబ్బంది సహకారంతో మండల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని బాధ్యతలు స్వీకరించిన చైతన్య తెలిపారు.