కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పంచారామాలతో పాటు శ్రీశైలం, కోటప్పకొండ, యాగంటి, యాదగిరి గుట్ట, వేములవాడ, కీసర క్షేత్రాలకు తెలవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. దీపారాధన, శివార్చన చేసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ముందుగానే ఆయా క్షేత్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.