W.G: ఆచంట రామేశ్వరస్వామి ఆలయంలో ఈరోజు సాయత్రం 6 గంటలకు అఖండ జ్యోతి (కర్పూర జ్యోతి) ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈవో సత్యనారాయణ, ఆలయ ఛైర్మన్ గజేశ్వరరావులు తెలిపారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఎన్నో ఏళ్లుగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుందన్నారు. గొడవర్తి వెంకన్నబాబు కుటుంబ సభ్యులు ఈ జ్యోతిని వెలిగిస్తారని తెలిపారు.