BDK: పినపాక మండలం ఈ బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి కబడ్డీపోటీలు జరుగుతున్నాయి. జడ్పీ సీఈవో నాగలక్ష్మి ఆ ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. ఎంపీడీవో సంకీర్త్, ఎంపీవో వెంకటేశ్వరరావు, ఎంఈవో నాగయ్య ఆధ్వర్యంలో పాఠశాల ఆటల గ్రౌండ్ పరిశీలించారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు వస్తున్న కారణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె పలు సూచనలు చేశారు.