కృష్ణా: మోపిదేవి గ్రామ ప్రధాన కూడలి వద్ద గురువారం రాత్రి ఒక హోటల్లో గ్యాస్ బండ లీకై భారీగా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో హోటల్లో టిఫిన్ చేస్తున్న వ్యక్తులు మంటలను చూసి భయంతో పరుగులు తీశారు. గ్రామస్తులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.