కోనసీమ: రామచంద్రపురం మండలం భవిత కేంద్రానికి రూ. 3 లక్షల విలువైన ఫిజియోథెరపీ పరికరాలను సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఛైర్మన్ వాసంశెట్టి సత్యం ఇవాళ అందజేశారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచనల మేరకు ఇసుజు మోటార్స్ ఇండియా ద్వారా భవితా కేంద్రమునకు సీఎస్ఆర్ నిధుల నుంచి సమకూర్చారు. ఈ పరికరాలు దివ్యాంగ పిల్లలకు ఉపయోగపడుతుందని సత్యం అన్నారు.