GNTR: తెనాలిలో డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్ణయించారు. ఈ నెల 25న స్వయం సహాయక సంఘాల మహిళలతో మెగా మీటింగ్ నిర్వహించి అవగాహన కల్పించనున్నారు. డిసెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు వివిధ రంగాల్లో ఆసక్తిగల మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఇవాళ ఆదేశించారు.