NZB: మెండోరా మండలంలో యువతకు వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్సై సుహాసిని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం పోచంపాడ్‌లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో వివరాలు వెల్లడించారు. NZB CP ఆదేశాల మేరకు శనివారం వాలీబాల్ పోటీలు జరుగనున్నాయన్నారు. చెడువ్యసనాలు, మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉంచేందుకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.