MHBD: కురవి మండలం బలపాల గ్రామానికి చెందిన వృద్ధ మహిళ సైదమ్మ అనారోగ్యంతో బలపాల బస్టాండ్ సమీపంలో నివసిస్తున్నట్లు జిల్లా ఎస్పీకి సమాచారం అందింది. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం కురవి ఎస్సై గండ్రాతి సతీష్ తన సిబ్బందితో కలిసి సైదమ్మకు భోజనం, బట్టలు, దుప్పట్లు అందించారు. అనంతరం ఖమ్మంలోని అన్నం పౌండేషన్ సంస్థలో సురక్షితంగా చేర్పించి మానవత్వం చాటుకున్నారు.