మహిళా క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ముగ్గురు మహారాష్ట్ర ప్లేయర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్‌లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఘన సన్మానం చేసింది. ఈ సందర్భంగా, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వారికి రూ. 2.25 కోట్ల భారీ నగదు బహుమతిని అందజేశారు. అలాగే, క్రీడాకారిణులను శాలువాలతో సత్కరించి, వారి అద్భుత ప్రదర్శనను కొనియాడారు.