ADB: క్రీడలతోనే శారీరక ఆరోగ్యం కలుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. దేశంలో హాకీ క్రీడ ప్రారంభమై 100 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.