అన్నమయ్య: మదనపల్లెలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే ఫోటోలు ఉన్నా, ఎంపీ మిథున్ రెడ్డి ఫోటో ఎందుకు లేదని వైసీపీ ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్ ప్రశ్నించారు. ఈ రోజు పోతబోలు గ్రామపంచాయతీలో పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి పాలనలో ప్రోటోకాల్ వర్తించదా అని నిలదీశారు.