KDP: పోరుమామిళ్లలో అనుమతి పత్రాలు లేకుండా నడుస్తున్న భాగ్యలక్ష్మి పబ్లిక్ స్కూల్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ఎంఈవో వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ అభిలాష్ మాట్లాడుతూ.. స్కూల్‌కు ఎటువంటి అనుమతులు లేకపోయినా విద్యాశాఖ అధికారులు నిశ్శబ్దంగా ఉండడం సరికాదని విమర్శించారు.