కోనసీమ: జిల్లా కోటిపల్లి నుంచి నరసాపురం వరకు చేపట్టిన రైల్వే నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఇవాళ మల్కిపురంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. ఈ పనులను ఎంపీ గంటి హరీశ్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.