NDL: నందికొట్కూరు పట్టణంలో ఇవాళ టీడీపీ సీనియర్ నాయకుడు సౌందర్య రాజ్ అకస్మాత్తుగా మృతి చెందాడు. మృతుని కుమారుడు తమడపల్లె విక్టర్ టీడీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జై సూర్య తమ్మడపల్లె విక్టర్ తండ్రి సౌందర్య రాజ్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మీకు ఏప్పుడు అండగా ఉంటానని ఏ సమస్య వచ్చిన తెలపాలన్నారు.