SRCL: SHG సభ్యులకు పంచడానికి 64 లక్షల చీరలు సిద్ధమవుతున్నాయని సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్లలో తయారవుతున్న ఇందిరా మహిళా శక్తి చీరలను 32 జిల్లా సమాఖ్యల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేయడంతో కార్మికులకు ఉపాధి కలుగుతుందన్నారు.