కోనసీమ: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి ప్రజా దర్బార్ అని అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పేర్కొన్నారు. ఇవాళ అమలాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. సంబంధిత అధికారుల ద్వారా అర్జీలు పరిష్కారానికి కృషి చేస్తామని తెలియాజేశాడు.