CTR: చిత్తూరు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త జశ్వంత్ మృతి పట్ల MLA గురజాల జగన్ మోహన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు రూరల్ మండలం దిగువమాసాపల్లి గ్రామ పంచాయతీ ఒంటిల్లు కృష్ణాపురం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ కో కన్వీనర్ జశ్వంత్ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం ఎమ్మెల్యే జశ్వంత్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.