SDPT: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని కళ్లేపల్లి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి భక్తులు విశేషమైన భక్తి శ్రద్ధలతో దీపదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణాన్ని నూనె దీపాలతో అందంగా అలంకరించారు. అనంతరం వెలుగులతో మెరిసిన ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది.