MHBD: కొత్తగూడ మండలంలోని బూరుగుగుంపులో శనివారం యాక్సిడెంట్ జరిగింది. ట్రాక్టర్ బైకును ఢీకొట్టిన ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి గంగారం మండలం మడగూడ గ్రామానికి చెందిన కల్తీ విక్రమ్‌గా స్థానికులు గుర్తించారు. వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని 108లో నర్సంపేటకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.