DNA ‘డబుల్ హెలిక్స్’ నిర్మాణ ఆవిష్కర్తల్లో ఒకరైన, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ జేమ్స్ డి వాట్సన్(97) కన్నుమూశారు. న్యూయార్క్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన కుమారుడు డంకన్ వాట్సన్ ధ్రువీకరించారు. 1928 ఏప్రిల్ 6న షికాగోలో జన్మించిన వాట్సన్ 24 ఏళ్ల వయసులోనే కేంబ్రిడ్జ్ వర్సిటీలో DNA నిర్మాణంపై పరిశోధనలు చేపట్టారు.