ప్రకాశం: సీఎం చంద్రబాబు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలులో ఈ నెల 10వ తేదీన జరిగే మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శనివారం ప్రకటించారు. ఈ మేరకు జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఎవరు అర్జీలు అందించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని పేర్కొన్నారు.