ATP: వైసీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శనివారం ప్రజా ఉద్యమం నిరసన పోస్టర్లను వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిరసన ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు.