KMM: సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. శనివారం సత్తుపల్లిలో జరిగిన ఈ ధర్నాలో ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకుడు యోబు మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.