తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్కు అరుదైన గౌరవం దక్కనుంది. ఇటీవల నట జీవితంలో 50ఏళ్ల ఘన ప్రస్థానం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 56వ అంతర్జాతీయ చలనచిత్ర వేడుక(IFFI) ముగింపు వేడుకలో రజినీని సన్మానించనున్నారు. ఇది ఈ ఈవెంట్కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక ఈ ఈవెంట్ గోవా వేదికగా ఈ నెల 20-28 వరకు జరగనుంది.