NLR: జిల్లా రైతు సోదరులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభవార్త చెప్పారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల నుంచి ఈనెల 15వ తేదీన నీళ్లు విడుదల చేస్తామని ప్రకటించారు. జిల్లాలో ఇవాళ IAB సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా నీళ్లు అందిస్తామన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు సైతం సోమశిల నుంచి నీరుస్తామని స్పష్టం చేశారు.