NZB: కాంగ్రెస్ హయాంలో గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆలూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 40 లక్షలతో డ్రెైనేజీ పనులు, సీసీ రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు.