WG: పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ను డీఎస్పీ డాక్టర్ జి. శ్రీవేద ఇవాళ తనిఖీల్లో భాగంగా సందర్శించారు. స్టేషన్లోని పలు రికార్డులు, క్రైమ్ వివరాలను సీఐ జి. శ్రీనివాస్, ఎస్సై సురేంద్ర కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా పోలీసులు వ్యవహరించాలని ఆమె ఈ సందర్భంగా వారికి సూచించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.