BDK: ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో మణుగూరు మండలం ప్రజాభవన్ MLA క్యాంపు కార్యాలయం నందు CM జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నియంత పాలన గోడలను బద్దలు కొట్టి ప్రజా పాలన తెచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు.