AP: రాష్ట్రంలో కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు చివరి అవకాశం ఇచ్చింది. నవంబర్ చివరి నాటికి ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత ఈకేవైసీ లేని కార్డులను రద్దు చేస్తామని పేర్కొంది. రేషన్ పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే.