CTR: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ 100 ఏళ్ల వేడుకల సందర్భంగా గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో శనివారం పుంగనూరు పట్టణంలోని కొత్త ఇండ్లలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన కళా మండపంలో కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మేరకు ఈనెల 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.