ATP: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం గురువారం అనంతపురంలో ప్రారంభమైంది. నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి హాజరై, ప్రజల నుంచి సంతకాలు సేకరించారు.