ఆస్ట్రేలియాతో జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. భారత బౌలర్ల ధాటికి 119 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 48 రన్స్ తేడాతో విజయం సొంతం చేసుకుంది. బౌలర్లలో సుందర్ 3 వికెట్లు తీయగా.. అక్షర్, దూబె తలో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్ల T20 సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.