MBNR: గిరిజనుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 8న నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ పోస్టర్ను మాజీమంత్రి గురువారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BRS ప్రభుత్వ హాయంలో గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేసి గిరిజనులకు కేసీఆర్ అండగా నిలిచారని గుర్తు చేశారు.