AP: ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు చేపట్టాలని వైసీపీ నేతలకు మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వైసీపీ నిరసన ర్యాలీలు చేస్తుందని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత తప్పుడు పని అని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదన్నారు.