వెస్టిండీస్‌తో జరిగిన రెండో T20లో న్యూజిలాండ్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 207/5 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్ మార్క్ చాప్మన్ 28 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో విధ్వంసం సృష్టించాడు. లక్ష్య ఛేదనలో విండీస్ బ్యాటర్లు పావెల్(45), షెపర్డ్(34), ఫోర్డ్(29)పోరాడినప్పటికీ, పరాజయం తప్పలేదు.