ADB: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్య, మధ్యన భోజనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం మండలాధ్యక్షుడు కోట్నక్ సక్కు అన్నారు. ఆయన గురువారం గాదిగూడ మండలంలోని పలు పాఠశాలల్లో సందర్శించారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతమైన గాదిగూడలో ఎక్కువ మంది ఆదివాసీ విద్యార్థులే ఉంటారని, వారికి ఉన్నత స్థాయి బోధించాలని ఉపాధ్యాయులను కోరారు.