US అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత వీసాల రద్దు సంఖ్య రెట్టింపు అయినట్లు పలు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆయన అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు వేలాది వీసాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 8 వేలకు పైగా విద్యార్థి వీసాలు రద్దయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ చర్య అమెరికా వలస విధానంలో తీసుకున్న కఠిన నిర్ణయంగా భావిస్తున్నారు.