ATP: ప్రభుత్వ పాఠశాలల్లో ‘సీటు లేదు’ అనే బోర్డు కనిపించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. రేపు లోకేశ్ కళ్యాణదుర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యేలు అమిలినేని, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కలిసి పరిశీలించారు. పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని వారు పేర్కొన్నారు.