PDPL: సింగరేణి గుర్తింపు సంఘం ద్వంద్వ వైఖరి విధానాలను మానుకోవాలని సీఐటీయూ ఎస్సీఈయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. గతంలో లాభాల విషయంలో సీఎంతో కలిసి చెక్కులు ఇచ్చి, బయటకు వచ్చి ఖండిస్తున్నామన్నారని తెలిపారు. 100 నుంచి 150 మస్టర్లకు పెంచిన అంశాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటనలు చేసి, కార్మికుల వ్యతిరేకతతో ధర్నాలకు పిలుపునివ్వడం సరికాదన్నారు.