PPM: జిల్లాలోని పార్వతీపురం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మిపురం మండలాల్లోని పలు గ్రామాలను జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్ది గురువారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముందుగా పార్వతీపురం మండలం కోటవానివలసలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సామాగ్రిని, రిజిస్టర్లను తనిఖీ చేసి కొనుగోలు ప్రక్రియను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.