గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ రామ్ చరణ్ కొత్త పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో రేపు ఉదయం 11:07 గంటలకు ‘చికిరి’ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ను చరణ్ కూడా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.